Meera Chopra: నటి మీరా చోప్రా తండ్రిని కత్తితో బెదిరించి ఫోన్ ఎత్తుకెళ్లిన దొంగలు.. నటి ట్వీట్‌కు పోలీసుల స్పందన

 Actor Meera Chopra father robbed at knife point
  • ఢిల్లీలోని  పోలీస్ కాలనీలోనే ఘటన
  • బంగారం, వాన, గ్రీకువీరుడు సినిమాల్లో నటించిన మీరా చోప్రా
  • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు
గతంలో కొన్ని తెలుగు సినిమాల్లో నటించిన మీరా చోప్రా తండ్రిని గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కత్తితో బెదిరించి ఆయన ఫోన్‌ను దోచుకెళ్లారు. ఈ విషయాన్ని మీరా చోప్రా ట్వీట్ చేసింది. ఢిల్లీలోని పోలీస్ కాలనీలోనే ఈ ఘటన జరిగిందని, వాకింగ్‌ కు వెళ్లిన తన తండ్రిని బెదిరించి ఫోన్ దోచుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పోలీసు కమిషనర్‌ను ట్యాగ్ చేసింది.

ఆమె ట్వీట్‌కు స్పందించిన డీసీపీ మరిన్ని వివరాలు కావాలని కోరారు. దీంతో ఆమె.. పీసీఆర్‌ పోలీస్‌ లేన్‌, మోడల్‌ టౌన్‌కు సమీపంలోని ప్రిన్స్‌ రోడ్డులో ఈ ఘటన జరిగినట్టు బదులిచ్చింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడంతో మీరా చోప్రా పోలీసులకు ధన్యవాదాలు తెలిపింది. మీరా చోప్రా తెలుగులో బంగారం, వాన, గ్రీకువీరుడు వంటి సినిమాల్లో నటించింది.
Meera Chopra
New Delhi
Rob

More Telugu News