Trivikram Srinivas: పవన్ సినిమాకి కథ .. మాటలు అందించనున్న త్రివిక్రమ్?

Pavan Movie

  • త్రివిక్రమ్ - పవన్ మధ్య మంచి సాన్నిహిత్యం
  • ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండు హిట్లు
  • పవన్ రిక్వెస్ట్ ను అంగీకరించిన త్రివిక్రమ్  

పవన్ .. త్రివిక్రమ్ మధ్య ఎంతో సాన్నిహిత్యం వుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో మూడు సినిమాలు రాగా, వాటిలో రెండు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. అలాంటి ఈ కాంబినేషన్లో సాధ్యమైనంత త్వరగా మరో సినిమా పడాలనే అభిమానులు భావిస్తున్నారు. అయితే కొంతవరకూ ఆ ముచ్చట తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం పవన్ తన తాజా చిత్రంగా 'వకీల్ సాబ్' చేస్తున్నాడు. ఆ తరువాత క్రిష్ దర్శకత్వంలో ఒక భారీ చారిత్రక చిత్రాన్ని  చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఇక ఈ ప్రాజెక్టు పూర్తికాగానే హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయనున్నాడు.

ఈ సినిమా తరువాత 'డాలీ' దర్శకత్వంలో పవన్ ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'గోపాల గోపాల' హిట్ మూవీగా నిలిచింది. డాలీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్, ఆ సినిమాకి కథ .. మాటలు అందించవలసిందిగా త్రివిక్రమ్ ను కోరాడట. అందుకు త్రివిక్రమ్ అంగీకరించాడని అంటున్నారు. గతంలో జయంత్ సి.పరాన్జీ దర్శకత్వం వహించిన 'తీన్ మార్' సినిమాకి త్రివిక్రమ్ సంభాషణలు అందించిన సంగతి తెలిసిందే. పవన్ సినిమాకి త్రివిక్రమ్ కథ .. మాటలను అందించనుండటం, ఈ ప్రాజెక్ట్ క్రేజ్ ను పెంచుతుందనే చెప్పచ్చు! 

Trivikram Srinivas
Pavan Kalyan
Kishore Kumar Pardhasani
  • Loading...

More Telugu News