Instagram: ఇన్ స్టాగ్రామ్ గ్రూప్ లో అశ్లీల చర్చలు జరిపిన బాలుడి ఆత్మహత్య!

Boy Sucide who Involved in Rape Talkings in Instagram

  • న్యూఢిల్లీలో కలకలం రేపిన ఘటన
  • అమ్మాయిని రేప్ చేయాలంటూ పోస్టులు
  • పోలీసులు ప్రశ్నిస్తారన్న భయంతో సూసైడ్

'బాయ్స్‌ లాకర్‌ రూమ్' పేరిట ఓ గ్రూప్ ను ఏర్పాటు చేసుకున్న కొందరు బాలురు, ఆ గ్రూప్ లో అమ్మాయిలపై అత్యాచారం చేయడం ఎలాగన్న విషయాలపై ఫోటోలు పెడుతూ, చర్చలు జరపడం న్యూఢిల్లీ శివార్లలోని గురుగ్రామ్ లో కలకలం రేపగా, పోలీసులు రంగంలోకి దిగేసరికి, ఈ గ్రూప్ లో చాటింగ్ చేసిన 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ బాలుడు ఒక అమ్మాయి పేరును ప్రస్తావించాడని, ఆపై తోటి విద్యార్థులు ఫోన్ చేసి, పోలీసులకు విషయం తెలిసిపోయిందని, వారు వస్తున్నారని హెచ్చరించడంతో భయపడి, తాను నివాసముంటున్న భవంతి 11వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు.

భవనం కింద పెద్ద శబ్దం వినిపించడంతో స్థానికులు వెళ్లి చూడగా, బాలుడు రక్తపు మడుగులో పడివున్నాడు. అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా, ఫలితం లేకపోయింది. అప్పటికే అతను మరణించాడని డాక్టర్లు స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, బాలుడి వద్ద ఎటువంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసు అధికారి దీపక్ కుమార్ మీడియాకు వెల్లడించారు.

కాగా, దాదాపు 30 మంది బాలురు ఓ గ్రూప్ గా ఏర్పడి, ఫలానా అమ్మాయిని గ్యాంగ్‌ రేప్‌ చేద్దామంటూ చర్చించుకుంటున్నారన్న సంగతి బయటకు రాగానే, ఢిల్లీలోని ఓ ప్రముఖ పాఠశాలకు చెందిన 16 ఏళ్ల విద్యార్థిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News