Vijay Devarakonda: సీనియర్లు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మేమందరం రెడీగా ఉన్నాం: విజయ్ దేవరకొండ

Vijay Devarakona responds to Nagarjuna opinion
  • కొన్ని వెబ్ సైట్లు దుష్ప్రచారం చేస్తున్నాయంటూ విజయ్ ఆగ్రహం
  • మద్దతు పలికిన చిరంజీవి, మహేశ్ బాబు, నాగార్జున
  • యాక్షన్ ప్లాన్ కావాలన్న నాగార్జున
నిన్నటిదాకా విజయ్ దేవరకొండకు సంబంధించిన వ్యవహారం కాస్తా, ఇప్పుడు టాలీవుడ్ మొత్తానికి సంబంధించిన అంశంగా మారుతోంది. కొన్ని వెబ్ సైట్లు పనిగట్టుకుని తన ప్రతిష్ఠ దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయంటూ యంగ్ హీరో విజయ్ దేవరకొండ గొంతెత్తిన సంగతి తెలిసిందే. మొదట మహేశ్ బాబు... విజయ్ కు మద్దతు ప్రకటించగా, ఆపై చిరంజీవి, నాగబాబు, నాగార్జున ఇలా ఒక్కొక్కరుగా రంగంలోకి దిగుతున్నారు. నాగార్జున స్పందిస్తూ, మద్దతు ప్రకటించడం కంటే ఇప్పుడు కావాల్సింది సమస్య పరిష్కారానికి తగిన యాక్షన్ ప్లాన్ అని స్పష్టం చేశారు. దీనిపై విజయ్ దేవరకొండ స్పందించాడు.

యాక్షన్ ప్లాన్ అనే మాట వింటుంటేనే ఉత్సాహం కలుగుతోందని, మీరు కూడా రంగంలోకి దూకి సమస్య తీవ్రతను మరింత స్పష్టంగా వినిపిస్తున్నందుకు థాంక్యూ నాగ్ సర్ అంటూ బదులిచ్చాడు. "సీనియర్లు గనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే కాన్ఫరెన్స్ కాల్ ద్వారా చర్చించేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం. తద్వారా ఇండస్ట్రీని పట్టిపీడిస్తున్న ఈ సమస్యను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిర్మూలించగలం" అని పేర్కొన్నాడు.
Vijay Devarakonda
Nagarjuna
Action Plan
Chiranjeevi
Mahesh Babu
Tollywood

More Telugu News