Sundeep Kishan: 'ఏ 1 ఎక్స్ ప్రెస్' పై చాలా ఆశలు పెట్టుకున్నాను: హీరో సందీప్ కిషన్

A1 Express Movie

  • 'ఏ 1  ఎక్స్ ప్రెస్ ' చివరిదశకు చేరుకుంది
  • తొలిసారిగా సిక్స్ ప్యాక్ తో కనిపిస్తాను
  • లైన్లో రెండు కొత్త ప్రాజెక్టులు వున్నాయన్న సందీప్

ఒక వైపున హీరోగా యువ కథానాయకులతో పోటీ పడుతూనే, మరో వైపున నిర్మాతగాను సక్సెస్ కావడానికి సందీప్ కిషన్ ప్రయత్నిస్తున్నాడు. ఆయన నుంచి ఈ మధ్య వచ్చిన 'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్' ఫరవాలేదనిపించుకుంది. ఆయన తాజా చిత్రంగా 'A 1 ఎక్స్ ప్రెస్' రూపొందుతోంది.

తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "ఈ సినిమా షూటింగును అనుకున్న ప్రకారమే చేస్తూ వచ్చాము. ఇంకా 10 రోజుల పాటు చిత్రీకరణ జరగవలసి వుంది. లాక్ డౌన్ తరువాత తిరిగి షూటింగ్ మొదలవుతుంది. మొదటిసారిగా ఈ సినిమాలో నేను సిక్స్ ప్యాక్ తో కనిపిస్తాను. ఇంతవరకూ వచ్చిన అవుట్ పుట్ చూసిన తరువాత ఈ సినిమాపై నాకున్న నమ్మకం మరింత పెరిగింది. నా జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తుండగా, కీలకమైన పాత్రలో మురళీ శర్మ కనిపించనున్నారు. లాక్ డౌన్ తరువాత  రెండు కొత్త ప్రాజెక్టులను గురించి చెబుతాను" అని అన్నాడు.

Sundeep Kishan
Lavanya Tripathi
Murali sharma
  • Loading...

More Telugu News