Rashi Khanna: ఆ ఇద్దరు హీరోలతో నటించాలనుంది: రాశి ఖన్నా

Rashi Khanna says she wants to act with Mahesh
  • పుస్తకాలతో కాలక్షేపం చేస్తున్నాను
  • నా అభిమాన హీరోయిన్ సమంత
  • లవ్ మ్యారేజ్ చేసుకుంటానన్న రాశి ఖన్నా
తెలుగు తెరపై అందాల కథానాయికగా యూత్ నుంచి మార్కులు కొట్టేసిన రాశి ఖన్నా, ఒక్కో సినిమాను చేస్తూ వెళుతోంది. 'వెంకీమామ' .. 'ప్రతిరోజు పండగే' సినిమాలతో విజయాలను అందుకున్న ఆమె, లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియా ద్వారా అభిమానులకు మరింత చేరువవుతోంది.

ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ .. "ప్రస్తుతం ఇంటి దగ్గర మంచి పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేస్తున్నాను. నేను ఎప్పుడూ ఆనందంగా ఉండటానికి కారణం నా కుటుంబ సభ్యులు .. స్నేహితులే. ప్రతి విషయాన్ని పాజిటివ్ గా తీసుకోవడం మరో కారణం. తెలుగులో నేను అభిమానించే కథానాయిక సమంత. తెలుగు హీరోల్లో మహేశ్ బాబు .. అల్లు అర్జున్ లతో నటించాలని వుంది. అలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నాను. ఇక పెళ్లిపై నాకంటూ కొన్ని అభిప్రాయాలు వున్నాయి. లవ్ మ్యారేజ్ చేసుకునే అవకాశాలే ఎక్కువ" అంటూ చెప్పుకొచ్చింది.
Rashi Khanna
Mahesh Babu
Allu Arjun

More Telugu News