Puri Jagannadh: 'అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి' చూసి, దర్శకత్వం వైపు వచ్చాను: దర్శకుడు వెంకీ కుడుముల

Bheeshma Movie

  • 'ఛలో'తో తొలి హిట్
  • 'భీష్మ'తో ప్రశంసలు
  • పూరి అభిమానినన్న వెంకీ కుడుముల

ఇటీవల కాలంలో వరుస విజయాలతో మంచి మార్కులు కొట్టేస్తున్న యువ దర్శకులలో వెంకీ కుడుముల ఒకరుగా   కనిపిస్తున్నాడు. 'ఛలో' సినిమాతో మంచి హిట్ కొట్టిన ఆయన, 'భీష్మ' సినిమాతో ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు.

తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లడుతూ .. 'భీష్మ' చూసిన వెంటనే చిరంజీవిగారు .. వెంకటేశ్ గారు .. శివకార్తికేయన్ గారు కాల్ చేసి అభినందించడం ఎప్పటికీ మరిచిపోలేను. మొదటి నుంచి నాకు దర్శకత్వంపై ఆసక్తి ఉండేది. అయితే పూరి గారు దర్శకత్వం వహించిన 'అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి' చూసిన తరువాత, దర్శకత్వం వైపు నా అడుగులు బలంగా పడ్డాయి. పూరిగారి ఆ సినిమా నన్ను బాగా ప్రభావితం చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సినిమాతో నేను పూరిగారి అభిమానిగా మారిపోయాను" అని చెప్పుకొచ్చాడు.

Puri Jagannadh
Venky Kudumula
Bheeshma Movie
  • Loading...

More Telugu News