Pavan Kalyan: 'గోపాల గోపాల' దర్శకుడికి పవన్ గ్రీన్ సిగ్నల్

Gopala Gopala Movie

  • గతంలో వచ్చిన 'గోపాల గోపాల' హిట్
  • 'కాటమ రాయుడు'కి లభించని ఆదరణ
  • మూడో సినిమాకి సన్నాహాలు  

రాజకీయాల కారణంగా కొంత కాలంగా సినిమాలకి దూరంగా ఉంటూ వస్తున్న పవన్ కల్యాణ్, ఇటీవల వరుస  సినిమాలను ఒప్పేసుకుంటూ వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి 'వకీల్ సాబ్' సిద్ధమవుతోంది. ఇక క్రిష్ దర్శకత్వంలోను .. హరీశ్ శంకర్ దర్శకత్వంలోను చెరో సినిమా చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో దర్శకుడు కిషోర్ కుమార్ పార్ధసాని ఒక కథను పవన్ కి వినిపించినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ కథకు కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. గతంలో పవన్ హీరోగా కిషోర్ కుమార్ పార్థసాని 'గోపాల గోపాల' .. 'కాటమరాయుడు' సినిమాలను తెరకెక్కించగా, 'గోపాల గోపాల'కి మంచి ఆదరణ లభించింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇప్పుడు చేయనున్నది మూడో సినిమా అన్నమాట. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

Pavan Kalyan
Kishore Kumar
Gopala Gopala MOvie
  • Loading...

More Telugu News