Pakistan: భారత రాయబార కార్యాలయ అధికారికి పాకిస్థాన్ సమన్లు
- భారత్ పై పాక్ ఆరోపణ
- రఖ్ చిక్రీ సెక్టార్ లో భారత్ కాల్పులకు పాల్పడింది
- ఈ ఘటనలో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయని ఆరోపణ
భారత బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని పాకిస్థాన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత రాయబార కార్యాలయానికి చెందిన సీనియర్ అధికారికి సమన్లు జారీ చేసింది. ఎటువంటి కారణం లేకుండా రఖ్ చిక్రీ సెక్టార్ లో భారత బలగాలు కాల్పులకు పాల్పడ్డాయని ఆరోపిస్తూ ఈ సమన్లు ఇచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయని పాక్ విదేశాంగ శాఖ ఆరోపించింది. అంతేకాకుండా, నియంత్రణ రేఖను ఆనుకుని ఉన్న జనావాసాలను లక్ష్యంగా చేసుకుని శక్తమంతమైన ఆయుధాలతో భారత్ కాల్పులకు పాల్పడుతోందని ఆరోపించింది.