: వివాదాలకు చైనా ప్రధాని చరమగీతం పాడతారా?
భారత పర్యటనలో ఉన్న చైనా ప్రధాని లీ కెకియాంగ్ ఈ రోజు ఐసీడబ్ల్యూఏ సమావేశంలో పాల్గోనున్నారు. ఈ సమావేశంలో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఆయన చరిత్రాత్మక ప్రసంగం చేస్తారు. ఈ ప్రసంగంలో చైనా ప్రధాని ఏం చెబుతారోనన్న ఆసక్తి ప్రపంచదేశాల్లో ఉంది. గత చాలాకాలంగా చైనా, భారత్ మధ్య అంతర్గత పోరు జరుగుతోంది. బయటకి స్నేహ హస్తం చాస్తున్నా లోలోపల ఈ రెండు దేశాలు కారాలు మిరియాలు నూరుతున్నాయి.
సరిహద్దు వివాదం, జలవివాదాలు ఈ రెండు దేశాల మధ్య చాలాకాలంగా ఉన్నాయి. కానీ ప్రపంచంలో తృతీయ ప్రభల శక్తిగా ఎదుగుతున్న ఈ రెండు దేశాలు వ్యాణిజ్యం పరంగా చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. చైనాలో ఉత్పత్తి సంస్థలు ఎక్కువగా ఉండడంతో దాన్ని సొమ్ము చేసుకునేందుకు చైనా ఫ్రెండ్ షిప్ పేరిట భారత్ తో మైత్రీబంధాన్ని దృఢం చేసుకోవాలని చూస్తున్నా సరిహద్దులు గుర్తించడంపై మాత్రం ససేమిరా అంటోంది. మరో వైపు నీటి పంపకాల సమస్యమీద తరాలుగా వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. నేటికీ చైనా భారత విన్నపాలని మన్నించడం మాట అటుంచి వినడం లేదు. మరి తాజా ప్రసంగంలో చైనా ప్రధాని వివాదాలకు చరమగీతం పాడతారా అనే ఆసక్తి ప్రపంచ వ్యాప్తంగా ఉంది.