delhi: ఢిల్లీలో 529 మంది జర్నలిస్టులకు పరీక్షలు.. ముగ్గురికే కరోనా పాజిటివ్‌

Arvind Kejriwal share only 3 out of 529 media persons tested have been detected positive

  • ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన
  • ఈ ముగ్గురూ త్వరగా కోలుకోవాలన్న సీఎం
  • గత వారం జర్నలిస్టులందరికీ పరీక్షలు చేసిన ఢిల్లీ సర్కారు

దేశవ్యాప్తంగా పలువురు జర్నలిస్టులు కరోనా బారిన పడుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ రోజు ఓ సానుకూల వార్త చెప్పారు. ఢిల్లీలో 529 మంది మీడియా ప్రతినిధులకు పరీక్షలు చేయగా.. కేవలం ముగ్గురికి మాత్రమే పాజిటివ్‌ అని తేలిందని చెప్పారు. జర్నలిస్టులందరూ క్షేమంగా ఉండాలని ఆయన కోరుకున్నారు.

ఇలాంటి విపత్కర పరిస్థితులలో పాత్రికేయుల పని చాలా ముఖ్యమైనదని అన్నారు. కరోనా సోకిన జర్నలిస్టులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని కేజ్రీవాల్ చెప్పారు. ముంబై, చెన్నైలో చాలా మంది జర్నలిస్టులకు కరోనా సోకినట్టు తేలవడంతో ఢిల్లీ ప్రభుత్వం గతవారం మీడియా ప్రతినిధులకు వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News