Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Samantha to start film production this year

  • సమంతకు సొంత బ్యానర్ 
  • తమిళ చిత్రంలో నవదీప్
  • స్విమ్ సూట్ గురించి అనసూయ

 *  పెళ్లయ్యాక కూడా సినిమాలలో నటిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న కథానాయిక సమంత తాజాగా సొంత చిత్ర నిర్మాణం చేబట్టాలని నిర్ణయం తీసుకుందట. ఈ ఏడాది సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసి, తొలి చిత్రాన్ని నిర్మిస్తుందట. కొత్త వారికి అవకాశాలు ఇస్తూ కథాబలం వున్న చిత్రాలని ఈ బ్యానర్ పై నిర్మిస్తుందని తెలుస్తోంది.
*  యువనటుడు నవదీప్ త్వరలో ఓ తమిళ చిత్రంలో నటించనున్నాడు. అజిత్ హీరోగా వినోత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'వాలిమై' చిత్రంలో నవదీప్ నటించనున్నట్టు తాజా సమాచారం.
*  గ్లామరస్ యాంకర్, సినీ నటి అనసూయ తాను సినిమాలలో బికినీ ధరించడంపై క్లారిటీ ఇచ్చింది. బికినీ ధరించే విషయంలో తనకు ఎటువంటి సంకోచం లేదని తెలిపింది. తన బాడీ షేప్ దానికి సూట్ అవుతుందనుకున్నప్పుడు తప్పకుండా బికినీ ధరిస్తానని చెప్పింది.

Samantha
Navadeep
Ajith
Anasuya
  • Loading...

More Telugu News