Corona Virus: కరోనాతో మరణించే జర్నలిస్టులకు రూ. 15 లక్షల ఎక్స్‌గ్రేషియా: ఒడిశా సీఎం

Rs 15 lakh exgratia for journalists who succumb to COVID19 in Odisha

  • వారి కుటుంబాలకు అందజేస్తామని ప్రకటన
  • వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడంలో పాత్రికేయుల పాత్ర కీలకమని వ్యాఖ
  • క్లిష్ట పరిస్థితుల్లోనూ నిబద్ధతతో పని చేస్తున్నారని కితాబు

తమ రాష్ట్రంలో కరోనా వైరస్‌ కారణంగా చనిపోయే జర్నలిస్టుల కుటుంబానికి రూ. 15 లక్షల రూపాయాల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడంలో విలేకరుల పాత్ర  కీలకమని ముఖ్యమంత్రి అన్నారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా  వాళ్లంతా నిబద్ధతతో పని చేస్తున్నారని  కొనియాడారు. కరోనా వైరస్‌ సోకి ఎవరైనా జర్నలిస్టు చనిపోతే ఆ వ్యక్తి కుటుంబానికి వెంటనే 15 లక్షలు అందిస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

పాత్రికేయుల సంక్షేమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్న సీఎంకు ఒడిశా ప్రభుత్వ మీడియా సలహాదారు మనాస్ మంగరాజ్‌ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, కరోనా వైరస్‌పై వార్తలు కవర్ చేస్తున్న జర్నలిస్టులందరికీ ఆరోగ్య బీమా కల్పించాలని కేంద్ర మంత్రి ప్రతాప్ సారంగి సహచర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కు లేఖ రాశారు. ముంబై, చెన్నై, భోపాల్‌ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే పలువురు పాత్రికేయులు కరోనా బారిన పడ్డారు.

  • Loading...

More Telugu News