Somireddy Chandra Mohan Reddy: కరోనా వస్తాది.. పోతాది అని సీఎం జగన్ సెలవిస్తున్నారు: సోమిరెడ్డి
- ప్రాణాంతక వైరస్‌పై కొత్త అర్థాలు చెబుతున్నారు
- కరోనా అంటే చిన్నపాటి జర్వం అంటున్నారు
- ప్రజల ఆరోగ్యంపై అయనకున్న చిన్నచూపునకు నిన్నటి ప్రెస్ మీటే నిదర్శనం
ప్రాణాంతక కరోనా వైరస్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త అర్థాలు చెబుతున్నారని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. కరోనా అంటే చిన్నపాటి పాటి జ్వరమని సీఎం సెలవిస్తున్నారని అన్నారు. ప్రజల ఆరోగ్యంపై అయనకున్న చిన్నచూపునకు నిన్నటి ప్రెస్‌మీటే నిదర్శనమని ఎద్దేవా చేశారు.
‘కరోనా అంటే చిన్నపాటి జ్వరమని, వస్తాది.. పోతాది..అని జగన్ సెలవిస్తున్నారు. కరోనా వైరస్ ప్రధానంగా శ్వాసకోస వ్యవస్థపైనే ప్రభావం చూపుతుందని, ప్రాణాంతకమని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిస్తుంటే సీఎం మాత్రం కొత్త అర్థాలు చెబుతున్నారు. ప్రజల ఆరోగ్యంపై ఆయనకున్న చిన్నచూపునకు నిన్నటి ప్రెస్ మీటే నిదర్శనం.’ అని సోమిరెడ్డి ట్వీట్ చేశారు.