Nagashourya: అటకెక్కిన నాగశౌర్య సినిమా?

Nagashourya

  • యూత్ లో నాగశౌర్యకి మంచి క్రేజ్
  • నిరాశ పరిచిన 'అశ్వద్ధామ'
  • కొత్త ప్రాజెక్టు ఇప్పట్లో లేనట్టే  

యూత్ లో నాగశౌర్యకి మంచి క్రేజ్ వుంది. ఒక వైపున సొంత బ్యానర్లో సినిమాలు చేస్తూనే, మరో వైపున ఇతర బ్యానర్లలో సినిమాలను అంగీకరిస్తూ వెళుతున్నాడు. 'అశ్వద్ధామ' ఆశించినస్థాయి విజయాన్ని అందుకోకపోవడంతో, ఆ తరువాత సినిమాలపై ఆయన దృష్టిపెట్టాడు. అలా ఆయన అంగీకరించిన సినిమాలలో సంతోష్ జాగర్లమూడి ప్రాజెక్టు ఒకటి.

నారాయణ దాస్ నారంగ్ .. రామ్మోహన్ రావు .. శరత్ మరార్ కలిసి ఈ సినిమాను నిర్మించాలనుకున్నారు. కొన్ని రోజుల క్రితం పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరపనున్నట్టు చెప్పారు. కానీ  ఇంతలోనే కరోనా విజృంభణ .. లాక్ డౌన్. ఇప్పట్లో చిత్రపరిశ్రమ కోలుకునేలా కనిపించడం లేదు.  ఎలాంటి భయాలు లేకుండా జనాలు థియేటర్స్ కి రావడానికి సమయం పడుతుందనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.  అందువలన నిర్మాతలు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేసినట్టుగా చెబుతున్నారు. ఇందులో వాస్తవమెంతో చూడాలి మరి.

Nagashourya
Santhosh Jagarlamudi
Sharath Marar
  • Loading...

More Telugu News