Guntur District: ఈ నెల 29, 30 తేదీల్లో నరసరావుపేటలో పూర్తి లాక్ డౌన్: గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్

Guntur District Collector visits Narasaraopet
  • ఏపీలో పెరుగుతున్న ‘కరోనా’ కేసుల సంఖ్య 
  • నరసరావుపేటలో శామ్యూల్ ఆనంద్ పర్యటన
  • రెడ్ జోన్ ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై ఆదేశాలు
ఈ నెల 29, 30 తేదీల్లో  నరసరావుపేటలో పూర్తి లాక్ డౌన్ ఉంటుందని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ తెలిపారు. ‘కరోనా’ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నరసరావుపేటలో ఇవాళ ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా సమీక్ష నిర్వహించారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ‘కరోనా’ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా పట్టణ ప్రజలు వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరం పాటించాలని సూచించారు. నిత్యావసర సరుకుల కొనుగోలు సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
Guntur District
Samuel Anand
Narasaraopet
Corona Virus

More Telugu News