Corona Virus: కరోనా నుంచి భారత్ విముక్తి పొందే రోజును తేల్చిన సర్వేలు!

coronavirus cases in india

  • మే 16 నాటికి కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావు
  • మే 16 నాటికి 35,000 కంటే ఎక్కువగా కొత్త కేసులు
  • జులై 25 నాటికి కరోనా నుంచి పూర్తిగా విముక్తి
  • స్పష్టం చేసిన భారత సాధికార కమిటీ, సింగపూర్‌ వర్సిటీ

భారత్‌లో వైద్య నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ నేతృత్వంలో నియమించిన సాధికార కమిటీ పలు ఆసక్తికర విషయాలను తెలుపుతూ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. మే 16 నాటికి దేశంలో కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాకపోవచ్చని తేల్చి చెప్పింది.

ఆ కమిటీ తెలిపిన వివరాల ప్రకారం... మే  3వ తేదీ వరకు దేశంలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య క్రమంగా పెరిగి గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. అనంతరం క్రమంగా తగ్గు ముఖం పడుతుంది. వచ్చేనెల మే 3 నుంచి 12 మధ్యలో రోజుకు సగటున వెయ్యికి పైగా కేసులు నమోదవుతాయి. అనంతరం పూర్తిగా తగ్గిపోతాయి. మే 16 నాటికి 35,000 కంటే ఎక్కువగా కొత్త కేసులు నమోదు అయ్యే అవకాశం లేదు. లాక్‌డౌన్‌ కారణంగా కేసుల సంఖ్య రెట్టింపు అయ్యే సమయం 10 రోజులకు పెరిగింది.

అయితే, మహారాష్ట్ర, గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌లో కేసులు క్రమంగా పెరుగుతుండడం పట్ల కొందరు నిపుణులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేడి, తేమ అధికంగా ఉన్న వాతావరణంలో వైరస్‌ వ్యాప్తి తక్కువుంటుందని అంతర్జాతీయ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

దాంతో, భారత్‌లోని వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కరోనా తగ్గే అవకాశం ఉండొచ్చని కొందరు అంచనాలు వేస్తున్నారు. అలాగే, భారతీయుల జీన్స్‌ కరోనా నుంచి కాపాడగలవని ఇంతవరకు ఎటువంటి ఆధారాలు లభించలేదు.

ఇదే విషయాన్ని స్పష్టం చేసిన సింగపూర్‌ వర్సిటీ

మరోవైపు, కేంద్ర సాధికార కమిటీ నివేదికలో స్పష్టమైన అంశాలు నిజమయ్యే సూచనలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సింగపూర్ వర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలోనూ ఇవే విషయాలు బయటపడ్డాయి.

భారత్‌లో కేసుల నమోదు, మరణాలు, డిశ్చార్జ్‌ అవుతున్న వారి సంఖ్యతో పాటు వైరస్‌ వ్యాప్తి రేటు తదితర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సింగపూర్‌ వర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ డిజైన్‌ పరిశోధకులు పలు అంచనాలు వేశారు. వారు వెల్లడించిన అధ్యయనంలో భారత్‌ జులై 25 నాటికి కరోనా నుంచి పూర్తిగా బయటపడుతుందని తేలింది. మే 21 నాటికి భారత్‌లో కరోనా తీవ్రత 97 శాతం తగ్గుతుంది .

  • Loading...

More Telugu News