Nagarjuna: అలా 'మనం' సినిమాకి పనిచేసే ఛాన్స్ వచ్చింది: హర్షవర్ధన్

Manam Movie

  • విక్రమ్ కుమార్ గొప్ప దర్శకుడు
  • 'మనం' సినిమాకి నన్ను పిలిపించాడు
  • నాగార్జునగారు ముందుగా డౌట్ పడ్డారన్న హర్ష  

నటుడిగా విభిన్నమైన పాత్రలను పోషించిన హర్షవర్ధన్ తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, దర్శకుడు విక్రమ్ కుమార్ గురించి ప్రస్తావించాడు. "విక్రమ్ కుమార్ చాలా గొప్ప దర్శకుడు .. ఆయనకి ఏం కావాలనే విషయంలో ఆయన చాలా క్లారిటీతో ఉంటారు. 'మనం' సినిమాకి విక్రమ్ కుమార్ నన్ను పిలిపించారు. ఒక మూడు బెస్ట్ సీన్స్ రాస్తే నాగార్జున గారికి చూపిద్దామని అన్నారు.

అది నాకు చాలా అసంతృప్తిని కలిగించింది. బెస్ట్ సీన్స్ కాకుండా .. మామూలు సీన్స్ తీసుకుని రాస్తానని చెప్పి .. అలాగే రాశాను. సాధారణమైన సీన్స్ మూడు రాసుకుని నాగార్జునగారి దగ్గరికి వెళ్లాము. నాగార్జునగారికి నేను ఆర్టిస్ట్ గా తెలుసు. నన్ను రైటర్ గా విక్రమ్ కుమార్ తీసుకెళ్లడం ఆయనకి ఆశ్చర్యాన్ని కలిగించింది. మొహమాటానికి నేను చెప్పిన సీన్స్ విన్నారు .. ఆ తరువాత ఆయన హ్యాపీగా ఫీలయ్యారు. అన్ని సీన్స్ నాతోనే రాయించమని చెప్పారు" అంటూ చెప్పుకొచ్చాడు.

Nagarjuna
Vikram Kumar
Harshavardhan
Manam Movie
  • Loading...

More Telugu News