Tablighi Jamaat: తబ్లిగీ జమాత్ చీఫ్ కు కరోనా నెగెటివ్
- కరోనా వ్యాప్తికి కారకులంటూ తబ్లిగీలపై ఆరోపణలు
- తబ్లిగీ జమాత్ చీఫ్ పై హత్యానేరం, మనీలాండరింగ్ కేసులు
- సాద్ కంధాల్వీకి కరోనా టెస్టులు నిర్వహించిన ఢిల్లీ అధికారులు
భారత్ లో కరోనా వ్యాప్తి విదేశాల్లో ఉన్నవారు ఇక్కడి రావడంతో మొదలైంది. ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ సమావేశం అనంతరం మరింత వ్యాపించిందని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ కంధాల్వీపై హత్యానేరం, మనీ లాండరింగ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా సాద్ కంధాల్వీకి కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల్లో నెగెటివ్ అని రిపోర్టు వచ్చింది. ఈ మేరకు ఆయన న్యాయవాది వెల్లడించారు. జమాత్ చీఫ్ కరోనా టెస్టుల నివేదికలు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఇంకా అందలేదు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సోమవారం సాద్ కంధాల్వీని విచారించే అవకాశాలు ఉన్నాయి.