Junior NTR: మరోసారి ఎన్టీఆర్ సరసన శ్రుతి హాసన్?

Trivikram Srinivas Movie

  • శ్రుతి హాసన్ తో సంప్రదింపులు
  •  గతంలో వచ్చిన 'రామయ్యా వస్తావయ్యా'
  • వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు  

త్రివిక్రమ్ తన తదుపరి సినిమాను ఎన్టీఆర్ తో చేయడానికి సిద్ధమవుతున్నాడు. 'అరవింద సమేత' తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ కి త్రివిక్రమ్ తుది మెరుగులు దిద్దుతున్నాడు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

కథాపరంగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉందట. అందువలన తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లోను మంచి క్రేజ్ కలిగివున్న కథానాయికలను తీసుకోవాలనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అలా జాన్వీకపూర్ .. పూజ హెగ్డే పేర్లు వినిపించాయి. తాజాగా శ్రుతి హాసన్ పేరు తెరపైకి వచ్చింది. ఒక కథానాయికగా ఆమెను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గతంలో ఎన్టీఆర్ - శ్రుతి హాసన్ కాంబినేషన్లో 'రామయ్యా వస్తావయ్యా' చేసిన సంగతి తెలిసిందే. వచ్చే వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

Junior NTR
Sruthi Hassan
Trivikram Srinivas
  • Loading...

More Telugu News