: టోర్నడోల ధాటికి 51 మంది మృతి
అమెరికాలో ఆదివారం టోర్నడోలు సృష్టించిన విధ్వంసానికి ప్రాణ నష్టంతోపాటు ఆస్తినష్టం కూడా తలెత్తింది. ఓక్లహోమ నగరం, పరిసరాలలో టోర్నడోల బీభత్సంతో 51 మంది మృతి చెందారు. 320కిలోమీటర్ల ప్రచండ వేగంతో విరుచుకుపడిన గాలి, మేఘాలతో భారీగా నష్టం వాటిల్లింది. ఒక స్కూల్ నేలమట్టం అయినట్లు సమాచారం. 120మందికిపైగా గాయాలపాలై ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారని ఓక్లహోమ నగర వైద్య పరిశీలకులు చెప్పారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ప్రచండ గాలి, వర్షంతో కూడిన మేఘాలనే టోర్నడోలుగా పిలుస్తారు.