Koratala Siva: 'ఆచార్య' విషయంలో అలా ప్లాన్ చేసిన కొరటాల

Acharya Movie

  • కొరటాల నుంచి 'ఆచార్య'
  • లాక్ డౌన్ కారణంగా జరుగుతున్న ఆలస్యం
  •  కాజల్ పోర్షన్ పక్కన పెట్టేసిన కొరటాల  

కొరటాల దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా 'ఆచార్య' రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగు ఆగిపోయింది. మే నుంచి చిరంజీవి - కాజల్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరించాలని కొరటాల ప్లాన్ చేసుకున్నారట. కానీ మే 7 తరువాత కూడా లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు వున్నాయనే టాక్ వినిపిస్తోంది.

ముంబైలో వున్న కాజల్ ఇక్కడికి వచ్చే పరిస్థితులు లేవు. అందువలన కాజల్ కాంబినేషన్ సీన్స్ ను పక్కన పెట్టేసి, ఇక్కడి ఆర్టిస్టుల కాంబినేషన్ సీన్స్ ను సెట్స్ లో చిత్రీకరించాలనే నిర్ణయానికి కొరటాల వచ్చాడని అంటున్నారు. పరిస్థితులు కుదురుకున్న తరువాత కాజల్ పై సన్నివేశాలను చిత్రీకరించాలని ఆయన భావిస్తున్నాడట. షూటింగు మరీ ఆలస్యమైతే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆయన అలా ప్లాన్ చేశాడని అంటున్నారు.

Koratala Siva
Chiranjeevi
Kajal Agarwal
Acharya Movie
  • Loading...

More Telugu News