Srikalahasti: శ్రీకాళహస్తి అష్టదిగ్బంధం... అత్యంత కఠిన నిబంధనలు అమలు!

Strict Rules in Srikalahasti

  • 80 వేల జనాభాలో 50 కేసులు
  • ఈ ఉదయం నుంచి సంపూర్ణ లాక్ డౌన్
  • మూడు గంటల వెసులుబాటు కూడా తొలగింపు

కేవలం 80 వేల జనాభా ఉన్న చిత్తూరు జిల్లా పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో ఏకంగా 40కి పైగా కరోనా కేసులు నమోదు కావడంతో పట్టణాన్ని అధికారులు అష్టదిగ్బంధం చేశారు. పట్టణంలో సంపూర్ణ లాక్ డౌన్ ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల నుంచి ప్రజలు ఎవరినీ బయటకు వెళ్లనివ్వబోమని, పాలు, మందులు, నిత్యావసరాలను వలంటీర్ల సాయంతో ఇళ్ల వద్దనే అందిస్తామని అధికారులు ప్రకటించారు.

కరోనా కట్టడికి రాష్ట్రంలోనే అత్యంత కఠిన నిబంధనలను శ్రీకాళహస్తిలో అమలు చేయాలని నిర్ణయించామని, ఎవరైనా తమ ఆదేశాలు అతిక్రమిస్తే డిజాస్టర్‌ మేనేజ్ ‌మెంట్‌ చట్టం కింద కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వుంటుందని హెచ్చరించారు.

ఈ మేరకు నిన్న రాత్రి పోలీసు ఎస్కార్ట్‌ వాహనాలతో ర్యాలీ చేస్తూ, నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మైక్‌ అనౌన్స్ ‌మెంట్ చేశారు.  ప్రజలకు ఏవైనా అవసరాలు ఉన్నా, అనారోగ్యం బారిన పడినా అధికారులు, వలంటీర్లను సంప్రదించాలని సూచించారు.

  • Loading...

More Telugu News