Suresh Babu: అప్పట్లో నన్ను చూసి కమలహాసన్ అనుకునేవారు: నిర్మాత సురేశ్ బాబు

Suresh Babu

  • మొదటి నుంచి బిజినెస్ విషయాలంటే ఇష్టం
  • నటన పట్ల ఆసక్తి వుండేది కాదు
  •  భారతీరాజా ఆఫర్ ను తిరస్కరించానన్న సురేశ్ బాబు

తెలుగు చిత్రపరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా .. రామానాయుడు వారసుడిగా సురేశ్ బాబు కొనసాగుతున్నారు. నిర్మాతగా ఆయనకి అపారమైన అనుభవం వుంది. అలాంటి సురేశ్ బాబు తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

"మంచి వయసులో ఉండగా నేను కమలహాసన్ లా ఉండేవాడిని. ఆయన కారు .. నా కారు ఒకే రకమైనవి. అందువలన నేను ఆ కారులో వెళుతుంటే కమల్ అనుకుని అభిమానులు నా కారు ఆపేసేవారు. ఇక భారతీరాజా గారు నాతో ఓ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. అయితే ఆయన ఆఫర్ ను నేను సున్నితంగా తిరస్కరించాను. మొదటి నుంచి కూడా నాకు నటన పట్ల ఆసక్తి ఉండేది కాదు. అందువలన నటనకు దూరంగానే వుండిపోయాను. బిజినెస్ వ్యవహారాల పట్లనే మక్కువ ఎక్కువగా ఉండేది. అందువల్లనే నిర్మాతగా స్థిరపడ్డాను" అని చెప్పుకొచ్చారు.

Suresh Babu
Bharathi Raja
Kamal Haasan
  • Loading...

More Telugu News