Bhainsa: భైంసాలో తెగబడ్డ అల్లరి మూకలు.. పోలీసులపై దాడి

Attack on Bhainsa police

  • రాత్రి కర్ఫ్యూ అమలవుతున్న తీరును పరిశీలించేందుకు వెళ్లిన అధికారులు
  • కొన్ని చోట్ల రోడ్లపై పెద్ద సంఖ్యలో జనాలు
  • అధికారులతో వాగ్వాదానికి దిగిన అల్లరి మూకలు

నిర్మల్ జిల్లా భైంసాలో అల్లరిమూకలు తెగించాయి. విధుల్లో ఉన్న పోలీసులపై దాడికి తెగబడ్డాయి. వివరాల్లోకి వెళ్తే, లాక్ డౌన్ నేపథ్యంలో రాత్రివేళ కర్ఫ్యూ అమలవుతున్న తీరును పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ ముషారా, ఎస్పీ శశిధరరాజు, అధికారులు వార్డుల్లో పర్యటించారు.

ఈ సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఓ వర్గానికి చెందిన ప్రజలు రోడ్లపై పెద్ద సంఖ్యలో గుమికూడి ఉన్నారు. దీంతో, వారిని చెదరగొట్టేందుకు పోలీసులు యత్నించారు. ఈ క్రమంలో వారిలో కొందరు అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులపై దాడికి తెగబడ్డారు. ఈ నేపథ్యంలో, ఆ ప్రాంతంలో అదనపు బలగాలను రప్పించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Bhainsa
Telangana
Police
Attack
  • Loading...

More Telugu News