Anushka: అనుష్కపై వస్తున్న వార్తల్లో నిజం లేదు: 'నిశ్శబ్దం' టీమ్

Nishabdham Movie

  • 'నిశ్శబ్దం' మూవీకి అమెజాన్ నుంచి ఆఫర్ అంటూ టాక్
  • అనుష్క అడ్డుపడుతోందంటూ ప్రచారం
  • పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేసిన టీమ్

అనుష్క తాజా చిత్రమైన 'నిశ్శబ్దం' కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే థియేటర్స్ కి రావలసిన ఈ సినిమా, లాక్  డౌన్ కారణంగా విడుదల తేదీని వాయిదా వేసుకుంది. అయితే ఈ సినిమాకి అమెజాన్ నుంచి భారీ ఆఫర్ వచ్చిందనే వార్త చక్కర్లు కొడుతోంది.

లాక్ డౌన్ తరువాత థియేటర్స్ కి ఎంతవరకూ జనాలు వస్తారనేది సందేహమేనని సినీపెద్దలే చెబుతున్న నేపథ్యంలో, చాలా మంది అమెజాన్ కి తమ సినిమాలను ఇచ్చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. అలాగే 'నిశ్శబ్దం' నిర్మాతలు కూడా ఆసక్తిని చూపించారనీ, అయితే అందుకు అనుష్క అడ్డుపడిందనే ప్రచారం ఊపందుకుంది. అనుష్క వ్యక్తిత్వం గురించి తెలిసిన చాలామంది ఈ ప్రచారాన్ని నమ్మలేదు. ఇదే విషయాన్ని గురించి ఈ సినిమా టీమ్ స్పందిస్తూ, ఇదంతా కేవలం పుకారు మాత్రమేనని స్పష్టం చేసింది. ఇలాంటి వార్తలను నమ్మవద్దంటూ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది.

Anushka
Hemanth Madhukar
Nishabdam Movie
  • Loading...

More Telugu News