Vaishnav Tej: తమిళంలో రీమేక్ దిశగా 'ఉప్పెన'!

Uppena Movie

  • నాయకా నాయికలకు తొలి చిత్రంగా 'ఉప్పెన'
  • దర్శకుడు బుచ్చిబాబుకి తొలి ప్రయత్నం
  • విజయ్ సేతుపతి చేతికి తమిళ రీమేక్ హక్కులు

వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా 'ఉప్పెన' రూపొందింది. తెలుగులో ఆయనకి ఇదే తొలి సినిమా. ఈ సినిమా ద్వారానే కృతి శెట్టి కథానాయికగా పరిచయమవుతోంది. నాయకా నాయికలను తెలుగు తెరకి పరిచయం చేస్తున్న దర్శకుడు బుచ్చిబాబుకి కూడా ఇదే తొలి సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి కనిపించనున్నాడు.

ఇప్పటికే తెలుగులో విడుదల కావలసిన ఈ సినిమా, లాక్  డౌన్ కారణంగా వాయిదా పడింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించారు. తమిళంలో ఈ సినిమాను రీమేక్ చేయాలని నిర్ణయించుకున్న విజయ్ సేతుపతి, మైత్రి వారి నుంచి రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేశాడట.  నిర్మాణ భాగస్వాములుగా మైత్రి వారు ఉంటారని అంటున్నారు. తెలుగులో విజయ్ సేతుపతి చేసిన పాత్రను, అక్కడ ఆయనే చేస్తాడని సమాచారం. ఇక నాయకా నాయికలుగా ఎవరిని తీసుకుంటారనేది త్వరలోనే తెలియనుంది.

Vaishnav Tej
Krithi Shetty
Uppena Movie
  • Loading...

More Telugu News