K Kavitha: జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ అనే వార్త కలచివేసింది: మాజీ ఎంపీ కవిత

Mumbai journalists testing corona positive is disturbing says Kavitha

  • ముంబైలో 53 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్
  • అందరూ క్వారంటైన్ కు తరలింపు
  • మీడియా మిత్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్న కవిత

ముంబైలో 53 మంది మీడియా ప్రతినిధులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 16, 17 తేదీల్లో ప్రత్యేక కరోనా శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక ఆజాద్ మైదానంలో నిర్వహించిన ఈ శిబిరానికి 171 మంది మీడియా ప్రతినిధులు రాగా, వారి నుంచి నమూనాలు సేకరించారు. పరీక్షల్లో 53 మందికి పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో... అందరినీ క్వారంటైన్ కు తరలించారు. దీనిపై టీఆర్ఎస్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.

'ముంబై జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ అనే వార్త కలచివేసింది. ఇది చాలా దురదృష్టకరం. కరోనా మహమ్మారిపై అందరం యుద్ధం చేస్తున్న ఈ తరుణంలో... మీడియా మిత్రులందరూ వారి గురించి, వారి కుటుంబాల గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి' అని కవిత సూచించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News