Tollywood: కన్నడ చిత్రం ‘దియా’ రీమేక్‌లో సమంత?

Samantha Eyes on Remake Of Kannada Movie Dia

  • భిన్నమైన ప్రేమ కథా చిత్రంపై ఆసక్తి
  • రెండు కీలక పాత్రల్లో నాగచైతన్య, నాగశౌర్య 
  • ఈ మధ్య రీమేక్‌లే చేస్తున్న టాలీవుడ్‌ అగ్రనటి

పెళ్లయిన తర్వాత వరుస సినిమాలు చేస్తూ.. మంచి విజయాలు ఖాతాలో వేసుకుంటున్న టాలీవుడ్ అగ్ర నటి అక్కినేని సమంత మరోసారి రీమేక్ చిత్రంలో నటించే అవకాశం కనిపిస్తోంది. సమంత ఇటీవల నటించిన మూడు సినిమాలూ (యూ టర్న్, ఓ బేబీ, జాను) రీమేక్‌లే. మూడూ విజయం సాధించాయి. దాంతో, ‘జాను’ తర్వాత సమంత తదుపరి చిత్రంపై అందరి దృష్టి నెలకొంది. అయితే, ఈ సారి కూడా సమంత మరో రీమేక్‌పైనే దృష్టి పెట్టిందని సమాచారం.

కన్నడలో విజయం సాధించిన ‘దియా’ అనే ప్రేమకథ చిత్రం తెలుగు రీమేక్‌లో సమంత హీరోయిన్‌గా నటించే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాదే విడుదలైన ‘దియా’ ప్రత్యేకమైన లవ్‌స్టోరీ. దీనికి సోషల్‌ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. లవ్‌స్టోరీ అయినప్పటికీ ఇందులో పాటలు, ఫైట్లు ఏమీ లేవు. కథ, కథనం, ప్రధాన పాత్రధారుల నటనే సినిమాకు బలం.

మాతృకలో టైటిల్‌ రోల్‌లో ఖుషి నటించగా.. దీక్షిత్‌, పృథ్వీ మరో రెండు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో రీమేక్‌ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు టాలీవుడ్‌ వర్గాల సమచారం. ఇందులో కథానాయికగా నటించేందుకు సమంత ఆసక్తి చూపిస్తున్నారని, మరో రెండు ప్రధాన పాత్రల్లో నాగచైతన్య, నాగశౌర్య నటిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Tollywood
Samantha
kannada
movie
Dia
remake
  • Loading...

More Telugu News