jayanth C. Paranji: తెలుగులో ఐశ్వర్యరాయ్ ఐటమ్ సాంగ్ వెనుక కథ గురించి చెప్పిన దర్శకుడు జయంత్

Ravoyi Chandamama Movie

  • 'ప్రేమించుకుందాం రా' చేయవలసిన ఐష్
  • నాగ్ సినిమాలో సాంగ్ కోసం ముంబైకి
  • ఐటమ్ చేయడానికి అంగీకరించిన ఐష్

తెలుగులో కొన్ని సూపర్ హిట్ చిత్రాలను రూపొందించిన జయంత్ సి.పరాన్జీకి, ఐశ్వర్య రాయ్ కుటుంబంతో మంచి సాన్నిహిత్యం ఉందట. 'ప్రేమించుకుందాం రా' సినిమా ద్వారా ఆమెను తెలుగు తెరకి పరిచయం చేయాలనే ప్రయత్నం చేసినప్పటికీ కుదరలేదని జయంత్ చెప్పాడు.

ఆ తరువాత ఆయన 'రావోయి చందమామ' సినిమాలో ముంబై హీరోయిన్లలో ఎవరితోనైనా ఐటమ్ సాంగ్ చేయించాలనే ఉద్దేశంతో ఆయన ముంబై వెళ్లాడట. ఆ సమయంలోనే అక్కడ ఐశ్వర్యరాయ్ తారసపడింది. 'మీ సినిమాలో నాకెందుకు అవకాశం ఇవ్వడం లేదు' అని ఐశ్వర్య రాయ్ చనువుగా అడగడంతో, ఆయన ఐటమ్ సాంగ్ గురించి చెప్పాడట. వెంటనే ఆమె ఆ సాంగ్ చేయడానికి అంగీకరించింది. అలా తెలుగు తెరకి ఆ పాట ద్వారా ఐశ్వర్యరాయ్ పరిచయమైంది.

jayanth C. Paranji
Aishwarya Rai
Ravoyi Chandamama Movie
  • Loading...

More Telugu News