Rajamouli: ఇంతకుముందు చేసిన సినిమాను మరిచిపోయి .. ప్రస్తుతం చేస్తున్న సినిమాపై దృష్టి పెడతాను: రాజమౌళి

RRR Movie

  • ఒకే జోనర్లో చేయడం ఇష్టం ఉండదు
  • ఏ సినిమాకి ఆ సినిమాయే ఇంపార్టెంట్
  •  కథ ఏదైనా పూర్తి దృష్టిపెడతానన్న రాజమౌళి  

అపజయమెరుగని దర్శకుడిగా రాజమౌళి తన కెరియర్ ను కొనసాగిస్తున్నారు. తాజాగా ఆయన టీవీ 9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన ఆలోచనలను .. అభిప్రాయాలను పంచుకున్నారు.

"ఒక జోనర్లో ఒక సినిమా చేసిన తరువాత, అదే మూసలో మరో సినిమా చేయకుండా పూర్తి డిఫరెంట్ గా వుండే మరో జోనర్ ను ఎంచుకుంటాను. అలా చేయడం వలన తప్పకుండా హిట్ వస్తుందని కాదు .. అది నాకు నేనుగా పెట్టుకున్న ఒక నియమం అంతే.

నా దృష్టిలో ఏ సినిమాకి ఆ సినిమాయే ఇంపార్టెంట్. ఇంతకుముందు చేసిన సినిమాను గురించి పూర్తిగా మరిచిపోయి, ప్రస్తుతం నా ఎదురుగా వున్న కథపై పూర్తి దృష్టిపెడతాను. నా చేతిలో వున్న కథకు పూర్తి న్యాయం చేయడానికి శాయశక్తులా కృషి చేస్తాను" అని చెప్పుకొచ్చారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News