America: అన్నదాతకు 19 బిలియన్ డాలర్ల ప్యాకేజీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌

19 Billion dollors Relief For Farmers anounced donald trumph

  • కరోనా వైరస్‌తో కుదేలైన వ్యవసాయ రంగం
  • వ్యవసాయ, పాల ఉత్పత్తులు కొనేవారే కరవు
  • దీంతో రైతులకు నేరుగా సాయం అందేలా ప్రకటన

తమ దేశానికి చెందిన అన్నదాతపై అవ్యాజ ప్రేమ కురిపించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. కరోనా వైరస్‌తో కుదేలైన వ్యవసాయరంగం, అనుబంధ పరిశ్రమల నిర్వాహకులను ఆదుకునేందుకు 19 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. నిన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ట్రంప్‌ ఈ సాయం నేరుగా అన్నదాతకు అందేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

'అమెరికా ఆర్థిక వ్యవస్థలో రైతుల భాగస్వామ్యం చాలా కీలకం. వారిని అన్ని విధాలా ఆదుకుంటాం' అని ట్రంప్ తెలిపారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి సోనీ పెరడ్యూ మాట్లాడుతూ ‘కరోనా విపత్తుతో వ్యవసాయానుబంధ విభాగాల వారు తీవ్రంగా నష్టపోయారు. విద్యా సంస్థలు మూతపడడం, అమెరికన్లు ఇళ్లకే పరిమితం కావడంతో మార్కెట్‌ పూర్తిగా దెబ్బతింది. ఉత్పత్తులను కొనేవారే లేరు. ఇది ఆహార సరఫరా లింక్‌ను దెబ్బతీసింది.

కొనుగోలుదారులు లేక తమ ఉత్పత్తులను రైతులు పంటపొలాల్లోనే నాశనం చేసుకోవాల్సిన దుస్థితి ఎదురయ్యింది. పాల ఉత్పత్తి దారుల పరిస్థితి ఇదే’ అని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అధ్యక్షుడు ప్రకటించిన సాయంలో 3 బిలియన్ డాలర్లను పాల ఉత్పత్తుల కొనుగోలుకు వెచ్చిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News