Karan Johar: 'భీష్మ' హిందీ రీమేక్ లో అర్జున్ కపూర్

karan Johar Movie

  • హిందీలోకి రీమేక్ అవుతున్న తెలుగు సినిమాలు
  • ఆ జాబితాలో చేరిన నితిన్ 'భీష్మ'
  • రణబీర్ కపూర్ కి బదులుగా అర్జున్ కపూర్

ఈ మధ్య కాలంలో తెలుగులో భారీ విజయాలను చవిచూసిన సినిమాలను హిందీలో రీమేక్ చేస్తున్నారు. 'అర్జున్ రెడ్డి' అక్కడ 'కబీర్ సింగ్' గా సంచలన విజయాన్ని నమోదు చేయడంతో, తెలుగు సినిమాలను హిందీలోకి రీమేక్ చేసే వేగం పెరిగింది. 'ఆర్ ఎక్స్ 100' .. 'ఓ బేబీ' సినిమాలు అక్కడ రీమేక్ గా రూపొందనున్నాయి. ఈ జాబితాలో 'భీష్మ' సినిమా కూడా చేరిపోయినట్టు తెలుస్తోంది.

నితిన్ కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన 'భీష్మ' ఇక్కడ పెద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమాను రణబీర్ కపూర్ హీరోగా హిందీలో నిర్మించడానికి కరణ్ జొహార్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే రణబీర్ కపూర్ కి వరుస కమిట్మెంట్లు ఉండటంతో, అర్జున్ కపూర్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ రీమేక్ ఆయన కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.

Karan Johar
Ranbir kapoor
Arjun kapoor
  • Loading...

More Telugu News