Soundarya: సౌందర్య తరచూ 'అయ్ బాబోయ్' అంటుండేవారు: నటి శ్రీలలిత

Sri Lalitha

  • సౌందర్య గారితో 4 సినిమాలు చేశాను
  • ఆమె ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు
  • సెట్లో ఆమె సరదాగా వుండేవారన్న శ్రీలలిత

తెలుగు తెరపై బాలనటిగా .. కేరక్టర్ ఆర్టిస్ట్ గా శ్రీలలిత మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ స్నేహితురాలిగా .. హీరో చెల్లెలిగా ఆమె గుర్తుపెట్టుకోదగిన పాత్రలను చేసింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, సౌందర్యను గురించి ప్రస్తావించింది.

"సౌందర్య గారి సినిమాల్లో నేను బాలనటిగా నాలుగు సినిమాలు చేశాను. షూటింగు సమయంలో ఆమె నన్ను ఎంతో బాగా చూసుకునేవారు. ఒకసారి షూటింగు సమయంలో నాకు జ్వరం వస్తే నన్ను తన ఒళ్లో పడుకోబెట్టుకున్నారు. ఎదుటి వ్యక్తి హోదాను బట్టి కాకుండా ఆమె అందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. ఆశ్చర్యాన్ని కలిగించే ఏ మాట విన్నా వెంటనే ఆమె 'అయ్ బాబోయ్' అనేవారు .. అది ఆమె ఊతపదం. ఆమెతో మాట్లాడుతుంటే ఒక హీరోయిన్ తో కాకుండా స్నేహితురాలితో మాట్లాడుతున్నట్టుగా అనిపించేది" అని చెప్పుకొచ్చింది.

Soundarya
Sri Lalitha
Tollywood
  • Loading...

More Telugu News