Raviteja: 'కిక్' టైపులో సాగే పాత్రలో రవితేజ

Raviteja Movie

  • రవితేజ చేతిలో మూడు సినిమాలు
  • తాజా చిత్రంగా రానున్న 'క్రాక్'
  • లైన్లో రమేశ్ వర్మ .. నక్కిన త్రినాథరావు

రవితేజకి ఆ మధ్య అనుకోకుండా గ్యాప్ లు ఎక్కువగా వచ్చాయి. వచ్చిన సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకున్నది లేదు. అందువల్లనే ఈ సారి ఆయన తన ప్లానింగ్ దెబ్బతినకుండా చూసుకున్నాడు. ముగ్గురు దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్' రూపొందుతోంది.

లాక్ డౌన్ తరువాత రమేశ్ వర్మ సినిమాను కూడా ఆయన మొదలుపెట్టనున్నాడు. ఇక నక్కిన త్రినాథరావు ప్రాజెక్టును కూడా పట్టాలెక్కించనున్నాడు. ఈ సినిమాలో రవితేజ పాత్ర 'కిక్' సినిమాలో ఆయన రోల్ ను గుర్తు చేస్తుందని సమాచారం. కథా కథనాలు పూర్తిగా భిన్నమైనవి. అయితే కామెడీతో కూడిన ఎనర్జీ .. ఎంటర్టైన్మెంట్ .. నాటకీయత విషయంలో మాత్రం 'కిక్' ను గుర్తుకు తెస్తుందని అంటున్నారు. యూత్ .. మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా పూర్తిస్థాయిలో అలరించేలా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు.

Raviteja
Ramesh Varma
Nakkina Thrinadha Rao
Gopichand Malineni
  • Loading...

More Telugu News