Vijayadevara konda: పోలీసులకు ఫ్రూట్ జ్యూస్ ఇచ్చి.. ప్రశంసలు కురిపించిన హీరో విజయ్ దేవరకొండ

Hero Viee

  • ‘కరోనా’ను అరికట్టే నిమిత్తం ఎంతో శ్రమిస్తున్న పోలీసులు
  • వారి సేవలకు ‘హ్యాట్సాప్’ చెప్పాల్సిందే
  • ‘కరోనా’, వేసవి  నేపథ్యంలో పోలీసులు జాగ్రత్తగా ఉండాలి 

‘కరోనా’ మహమ్మారిని అరికట్టే నిమిత్తం ఎంతో శ్రమిస్తున్న పోలీసులకు ‘హాట్సాఫ్’ చెబుతున్నానంటూ వారిపై ప్రశంసలు కురిపించాడు ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ. లాక్ డౌన్ లో సైతం తమ విధులు నిర్వహిస్తున్నారని, అంతే కాకుండా, ‘కరోనా’పై ప్రజలకు అవగహన కల్పించడమే కాకుండా, అప్రమత్తంగా  ఉంచుతున్నారంటూ వారిని కొనియాడారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తో కలిసి అభినందించాడు. అలాగే హైదరాబాద్ లోని అన్ని పోలీస్ చెక్ పోస్ట్ ల వద్ద విధుల్లో ఉన్న పోలీసులకు ఫ్రూట్ జ్యూస్ లను విజయ్ దేవరకొండ అందజేశాడు. ‘కరోనా’, వేసవి కాలం నేపథ్యంలో పోలీసులు జాగ్రత్తగా ఉండాలని, తమ ఆరోగ్యంపై తగు శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు.

Vijayadevara konda
Hero
Tollywood
Hyderabad
police
  • Loading...

More Telugu News