Amarpatnaik: ఏపీ సీఎస్ కు లేఖ రాసినా సాయం చేయలేదన్న బీజేడీ ఎంపీ అమర్ పట్నాయక్

Odisa BJD MP Amar patnaik allegations on AP CS
  • లాక్ డౌన్ వల్ల ఒడిశా కూలీలు నెల్లూరులో చిక్కుకుపోయారు
  • ఈ విషయమై ఏపీ సీఎస్ కు లేఖ రాసినా సాయం చేయలేదు
  • ఆ కూలీలు కాలినడకన ఒడిశాకు రావాలని నిర్ణయించుకున్నారు
లాక్ డౌన్ కారణంగా ఏపీలో చిక్కుకుపోయిన ఒడిశా కూలీలను ఆదుకోవాలంటూ సీఎస్ నీలం సాహ్నికి లేఖ రాసినా  ఫలితం లేకుండా పోయిందని బీజేడీ ఎంపీ అమర్ పట్నాయక్ విమర్శించారు. ఈ విషయమై లేఖ రాసినా సాయం చేయలేదని అన్నారు. నెల్లూరులో చిక్కుకున్న 30 మందికి రేషన్ కూడా ఇవ్వలేదని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఏపీ నుంచి ఒడిశాకు కాలినడకన రావడం మినహా వారికి వేరే దారి లేదని, సాయం చేయకపోవడం వల్లే వారు నడుచుకుంటూ బయలుదేరాలన్న నిర్ణయం తీసుకున్నారని అన్నారు.

Amarpatnaik
BJD
MP
Odisha
Andhra Pradesh
cs
Neelam Sahni

More Telugu News