Srikanth Iyengar: ట్రోల్స్ తో విజయ్ దేవరకొండ ఎదుగుదలను ఆపలేరు: నటుడు శ్రీకాంత్ అయ్యంగార్

Srikanth Iyengar

  • పెద్ద పెద్ద వాళ్లకే ట్రోల్స్ తప్పడం లేదు
  • ట్రోల్స్ చేసేవారికి వేరే పనిలేదు
  •  విజయ్ దేవరకొండ కెరియర్ ను వాళ్లు ప్రభావితం చేయలేరు

విభిన్నమైన పాత్రలను పోషిస్తూ .. విలక్షణమైన నటుడిగా శ్రీకాంత్ అయ్యంగార్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  'బ్రోచేవారెవరురా'లో నివేదా థామస్ తండ్రి పాత్ర ద్వారా ప్రేక్షకులకు ఆయన మరింత చేరువయ్యాడు. 'తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, విజయ్ దేవరకొండ సినిమాల విడుదల సమయంలో జరిగే ట్రోల్స్ గురించి ప్రస్తావించాడు.

"విజయ్ దేవరకొండ చాలా టాలెంటెడ్ .. ఎంతో కష్టపడి పైకి వచ్చాడు. విజయ్ దేవరకొండతో నేను ఒక సినిమా చేశాను .. ఆయన చాలా లవ్లీ పర్సన్. నటన పట్ల ఆయనకి గల అంకితభావం చూస్తే హ్యాట్సాఫ్ చెప్పాలనిపిస్తుంది. అలాంటి విజయ్ దేవరకొండను కొంతమంది పనిగట్టుకుని ట్రోల్ చేస్తున్నారు. పెద్ద పెద్ద స్టార్లకే ట్రోల్స్ తప్పడం లేదు. ఎందుకంటే ట్రోల్స్ చేసేవారికి మరో పనిలేదు. నా దృష్టిలో అలాంటి వాళ్లకి ఎంతమాత్రం విలువే లేదు. వాళ్ల ట్రోల్స్ విజయ్ దేవరకొండ కెరియర్ ను ఎంత మాత్రం ప్రభావితం చేయలేవు. ఆయన ఇంకా ఇంకా ఎదుగుతాడు" అని చెప్పుకొచ్చాడు.

Srikanth Iyengar
Vijay Devarakonda
Tollywood
  • Loading...

More Telugu News