Jagapathi Babu: 'అరవింద సమేత'లో నేను ఇంకా బాగా చేయాల్సింది: జగపతిబాబు

Jagapathi Babu

  • 'అరవింద సమేత' మళ్లీ చూశాను
  • 'బసిరెడ్డి'గా కొన్ని సీన్స్ లో ఇన్వాల్వ్ కాలేకపోయాను
  • మూడ్ బాగుండాలనే విషయం అర్థమైందన్న జగపతిబాబు

తెలుగు తెరపై హీరోగా ఒక వెలుగు వెలిగిన జగపతిబాబు, ఆ తరువాత విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ గా మారారు. విలన్ గా ఆయన చేసిన సినిమాలు భారీ విజయాలను సాధించాయి. అలాంటి సినిమాల్లో 'అరవింద సమేత' ఒకటిగా కనిపిస్తుంది. ఈ సినిమాలో 'బసిరెడ్డి' పాత్రలో ఆయన నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటిపట్టునే వున్న జగపతిబాబు ఈ సినిమాను గురించి ప్రస్తావించారు.

'ఇంటిపట్టునే ఖాళీగా ఉంటున్నాను గదా .. అందువలన గతంలో నేను చేసిన సినిమాలను మళ్లీ చూసుకుంటున్నాను. బాగా చేశానా .. లేదా అని నాకు నేను గా ప్రశ్నించుకుంటున్నాను. అలా 'అరవింద సమేత' చూసిన తరువాత, 'బసిరెడ్డి' పాత్రను ఇంకా బాగా చేయాల్సిందనిపించింది. కొన్ని సన్నివేశాల్లో నేను పూర్తిగా ఇన్వాల్వ్ కాలేదనిపించింది. అప్పుడు నా మూడ్ బాగోలేకపోవడమే అందుకు కారణమనుకుంటున్నాను. మూడ్ బాగోలేకపోతే ఆ ప్రభావం నటనపై పడుతుందని నాకు అర్థమైంది. అందుకే ఇకపై అలా జరగకుండా రిలాక్స్డ్ గా వుండాలని భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.

Jagapathi Babu
Aravinda Sametha
Tollywood
  • Loading...

More Telugu News