Jagan: కరోనాపై జగన్ ఉన్నతస్థాయి సమీక్ష.. పలు ఆదేశాలు జారీ!

jagan on corona

  • నేటి నుండి మళ్లీ రేషన్‌ పంపిణీ
  • రేషన్‌ షాపులకు అనుబంధంగా కౌంటర్ల పెంపు
  • లబ్ధిదారులకు వేర్వేరు కలర్‌లతో కూడిన కూపన్లు 
  • ఏ సమయంలో రేషన్‌ తీసుకోవాలనే విషయంపై కూపన్లలో సమాచారం  

కొవిడ్‌-19 విజృంభిస్తోన్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ మంత్రులు ఆళ్ల నాని, బొత్స సత్యనారాయణ, మోపిదేవి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కరోనా ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అలాగే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించిన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఆయన చర్చలు జరిపారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినప్పటికీ రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయి.  

మాన‌వ‌తా దృక్ప‌థంతో పనిచేద్దామని అధికారులతో జగన్ అన్నారు. నేటి నుండి మళ్లీ రేషన్‌ పంపిణీ చేస్తోన్న నేపథ్యంలో రేషన్‌ షాపులకు అనుబంధంగా కౌంటర్ల పెంపునకు జగన్‌ ఆదేశాలు ఇచ్చారు. లబ్ధిదారులకు వేర్వేరు రంగులతో కూడిన కూపన్లు అందజేయాలని, ఏ రోజు, ఏ సమయంలో రేషన్‌ తీసుకోవాలో కూడా ఆ కూపన్లలో సమాచారం ఇవ్వాలని నిర్ణయించారు. రేషన్‌ కోసం వచ్చే లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా షామియానాల ఏర్పాటుకు జగన్‌ ఆదేశాలు ఇచ్చారు.

  • Loading...

More Telugu News