Allu Arjun: 'పుష్ప' విషయంలో పట్టుదలతో వున్న దేవిశ్రీ

Pushpa Movie

  • సుకుమార్, బన్నీ కలయికలో 'పుష్ప'
  • తమన్ ని పెడదామన్న అల్లు అర్జున్ 
  • బన్నీకి సర్ది చెప్పి, దేవిశ్రీకి చాన్స్ ఇచ్చిన సుకుమార్  

సుకుమార్ - దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన చిత్రాల్లోని ఐటమ్ సాంగ్స్ విశేషమైన ఆదరణ పొందాయి. ఈ నేపథ్యంలో సుకుమార్ 'పుష్ప' సినిమాకి కూడా దేవీశ్రీని తీసుకున్నాడు.

అయితే ఈ సినిమాకి ముందు బన్నీ చేసిన 'అల వైకుంఠపురములో' సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. ఆ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది. అందువలన తమన్ ను తీసుకుందామని బన్నీ అన్నప్పటికీ, ఆయనకి సర్ది చెప్పి దేవిశ్రీకే సుకుమార్ ఛాన్స్ ఇచ్చాడు. ఎలాంటి పరిస్థితుల్లో సుకుమార్ తనకి ఈ సినిమా ఇచ్చాడనే విషయం దేవిశ్రీకి తెలుసు. అందువలన 'పుష్ప' సినిమాతో కొత్తదనం చూపించాలనీ, తనేమిటనేది నిరూపించుకోవాలనే పట్టుదలతో దేవిశ్రీ వున్నాడని అంటున్నారు. ఇటీవల కాలంలో దేవిశ్రీ సంగీతంలో పస తగ్గిందనే విమర్శలకు ఆయన ఎలా చెక్  పెడతాడో చూడాలి.

Allu Arjun
Rashmika Mandanna
Sukumar
Devisri Prasad
  • Loading...

More Telugu News