Lockdown: సాయం చేస్తూ సెల్ఫీ, ఫొటో తీసుకోవడం రాజస్థాన్ లోని ఆ జిల్లాలో నిషేధం

Clicking Selfies and Photos While Distributing Food Amid Lockdown Banned In Ajmer

  • ఆహార పదార్థాలు పంచేటప్పుడూ సామాజిక దూరం పాటించాలి
  • లేదంటే కేసు నమోదు చేస్తాం: రాజస్థాన్ అజ్మీర్ జిల్లా కలెక్టర్
  • పేదలకు సహాయాన్ని ప్రచారానికి వాడుకుంటున్న కొందరు

కరోనా వైరస్ కట్టడికి  కేంద్రం లాక్‌డౌన్‌ అమలు చేస్తుండడంతో  దేశ వ్యాప్తంగా చాలా మంది ఉపాధి కోల్పోయారు. ముఖ్యంగా రోజువారీ కూలీలు రోడ్డున పడ్డారు. పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటి వారికి కొందరు అండగా నిలుస్తున్నారు. ఆహారం, నిత్యావసర సరుకులు అందిస్తూ మంచి మనసు చాటుకుంటున్నారు.

అంతవరకూ బాగానే ఉంది కానీ.. కొందరు మాత్రం ఈ సాయాన్ని ప్రచారం కోసం వాడుకుంటున్నారు. పేదలకు ఆహారం, ఇతర సరుకులు అందిస్తున్నప్పుడు సెల్ఫీలు, ఫొటోలు తీసుకొని వివిధ  సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలాగే, సామాజిక దూరాన్ని కూడా పాటించడం లేదు.

ఈ విషయాన్ని రాజస్థాన్‌ లోని అజ్మీర్ జిల్లా కలెక్టర్ గుర్తించారు. తమ జిల్లాలో ఆహార పదార్థాలు పంచుతున్నప్పుడు సెల్ఫీలు, ఫొటోలు తీసుకోవడంపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  లేదంటే సోషల్ డిస్టెన్సింగ్‌ నిబంధన ఉల్లంఘించినట్టుగా గుర్తించి ఐపీసీ 188 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేస్తామని ఆ ఉత్తర్వులో స్పష్టం చేశారు. కాగా, రాజస్థాన్ రాష్ట్రంలో ఇప్పటిదాకా 463  కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

  • Loading...

More Telugu News