: ప్రజలకోసం టీడీపీ 'పంచరత్నాలు'
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ తనదైన శైలిలో ప్రజలతో మమేకం అవుతున్నారు. నేడు కరీంనగర్ జిల్లా జగిత్యాలలో జరిగిన మినీమహానాడులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు పలు విషయాలపై దిశానిర్ధేశం చేశారు. ముఖ్యంగా, వచ్చే ఎన్నికల్లో అనుసరించబోయే మానిఫెస్టోను పంచరత్నాల పేరిట వెల్లడించారు. రైతులకు రుణాల మాఫీ, మద్యం బెల్టు షాపుల ఎత్తివేత, తాగునీటి సమస్య పరిష్కారం, బీసీలకు వంద సీట్లు, నిరుద్యోగులకు నెలనెలా నగదు.. ల్యాప్ టాప్ ల అందజేత.. ఇవే పార్టీ పంచరత్నాలని ఆ యువనేత వివరించారు. అంతేగాకుండా, అధినేత చంద్రబాబు ప్రకటించిన ఈ పంచసూత్రాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన బాధ్యత కార్యకర్తలదే అని వారికి కర్తవ్యబోధ చేశారు.