Chiranjeevi: అల్లు అరవింద్ మా కుటుంబ సభ్యుడు.. ఆయనతో విభేదాలా?: చిరంజీవి

Chiranjeevi

  • ఒకరి సలహాలు ఒకరం తీసుకుంటూ ఉంటాము
  • ముఖ్యమైన విషయాలను కలిసి చర్చించుకుంటాం 
  • పవన్ తోను విభేదాలు ఉన్నట్టు ప్రచారం చేశారన్న చిరూ 

చిరంజీవి - అల్లు అరవింద్ మధ్య మనస్పర్థలు తలెత్తాయనే వార్తలు కొంతకాలంగా షికారు చేస్తున్నాయి. చిరంజీవి రీ ఎంట్రీ తరువాత చరణ్ సొంత బ్యానర్ పైనే ఆయన సినిమాలు నిర్మిస్తుండటం, గీతా ఆర్ట్స్ వారికి అవకాశం ఇవ్వకపోవడం మనస్పర్థలను మరింత పెంచాయనే ప్రచారం జరుగుతోంది.

ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని గురించిన ప్రస్తావన రావడంతో చిరంజీవి స్పందిస్తూ .. "అల్లు అరవింద్ మా కుటుంబ సభ్యుడు. ఇద్దరం కూడా ఒకరి సలహాలు ఒకరం తీసుకుంటూ ఉంటాము. ముఖ్యమైన విషయాలను కలిసి చర్చించుకుంటూ ఉంటాము. మా మధ్య విభేదాలు ఉన్నాయనడంలో ఎంతమాత్రం నిజం లేదు. గతంలో నా తమ్ముడు పవన్ కల్యాణ్ తోను విభేదాలు వున్నట్టుగా ప్రచారం చేశారు. ఇలాంటి ఆరోపణలు ఎవరు చేస్తున్నారో .. ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. నిజం చెప్పాలంటే ఇలాంటి పుకార్లను నేను పెద్దగా పట్టించుకోను కూడా" అంటూ చెప్పుకొచ్చారు.

Chiranjeevi
Allu Aravind
pavan kalyan
  • Loading...

More Telugu News