Chandrababu: నా దూరదృష్టిని మీరు గుర్తించారు... కృతజ్ఞతలు: వైఎస్ జగన్ కు చంద్రబాబునాయుడు లేఖ

Chandrababu Letter to AP CM Jagan

  • నాడు విశాఖలో మెడ్ టెక్ జోన్ పెట్టాం
  • నేడు అక్కడ వైద్య పరికరాలు తయారవుతున్నాయి
  • దేశానికే గర్వకారణంగా నిలిచిందన్న చంద్రబాబు

తాను దూరదృష్టితో విశాఖలో మెడ్ టెక్ జోన్ ఏర్పాటుకు కృషి చేస్తే, ఇప్పటి ప్రభుత్వం దాన్ని గుర్తించిందని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ మేరకు ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ కు ఆయన ఓ లేఖను రాశారు. ఇండియాలో తొలి మెడికల్ ఎక్విప్ మెంట్ తయారీ కేంద్రంగా వైజాగ్ లో మెడ్ టెక్ జోన్ ను తాను ఏర్పాటు చేశానని, కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో, అక్కడ తయారవుతున్న పరికరాలు ఎంతో ఉపకరిస్తున్నాయని ఆయన అన్నారు. గతంలో మెడ్ టెక్ జోన్ ఓ మయసభ అంటూ విమర్శించిన వాళ్లు, ఇప్పుడది దేశానికే గర్వకారణమని అంటున్నారని, జగన్ ప్రభుత్వం మెడ్ టెక్ జోన్ గొప్పతనాన్ని గుర్తించినందుకు తన కృతజ్ఞతలని అన్నారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత, ఈ 10 నెలల్లో మెడ్ టెక్ జోన్ ను నిర్లక్ష్యం చేసిందని, ఈ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేసుంటే, మెరుగైన ఫలితాలు ఇప్పుడు కళ్ల ముందుండేవని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కుటుంబాల వారికి నెలకు రూ. 5 వేలు ప్రభుత్వ సాయం చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాజకీయ  కక్షతో 'అన్న క్యాంటీన్'లను నిలిపివేశారని, వాటిని తెరిపించి, పేదలకు అన్నం పెట్టాలని, చంద్రన్న బీమాను పునరుద్ధరించాలని ఆయన కోరారు. ప్రభుత్వమే రైతుల పంటను కొనుగోలు చేయాలని సూచించారు.

  • Loading...

More Telugu News