Corona Virus: లాక్ డౌన్ పొడిగించాలంటున్న రాష్ట్రాలు... ఆలోచనలో పడ్డ కేంద్రం!

States wants Centre to continue lock down

  • దేశవ్యాప్తంగా ఎక్కువవుతున్న కరోనా కేసులు
  • పెరుగుతున్న మరణాల సంఖ్య
  • ఈ నెల 14తో ముగియనున్న 21 రోజుల లాక్ డౌన్

దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. కేవలం కొన్నిరోజుల వ్యవధిలోనే కేసుల సంఖ్య రెట్టింపైంది. ఈ నేపథ్యంలో, లాక్ డౌన్ మరికొన్నిరోజులు పొడిగించాలని అనేక రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. కేంద్రం ప్రకటించిన 21 రోజుల లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగియనుంది. అయితే ఇప్పటికీ పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు వస్తుండడం, మరణాల సంఖ్య కూడా పెరుగుతుండడం రాష్ట్రాలను కలవరపాటుకు గురిచేస్తోంది.

ఈ దశలో లాక్ డౌన్ ఎత్తివేస్తే తీవ్రనష్టం తప్పదని తెలంగాణ, మధ్యప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అందుకే లాక్ డౌన్ పొడిగించాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. మరోపక్క, లాక్ డౌన్ పొడిగింపుపై రాష్ట్రాల నుంచే కాకుండా మేధావుల నుంచి కూడా వినతులు వస్తున్న నేపథ్యంలో కేంద్రం నిశితంగా పరిశీలిస్తోంది. నిన్నటి క్యాబినెట్ సమావేశంలో కూడా ప్రధాని మోదీ దీర్ఘకాల పోరాటానికి సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించారు. ఇటు రాష్ట్రాలు కూడా విజ్ఞప్తులు చేస్తుండడంతో, కేంద్రం లాక్ డౌన్ పొడిగింపుకే మొగ్గు చూపే అవకాశాలున్నాయని ఢిల్లీ వర్గాలంటున్నాయి.

  • Loading...

More Telugu News