Apple: కరోనా రక్షక కవచాలు రూపొందిస్తున్న ఆపిల్ సంస్థ
- వైద్యసిబ్బంది భద్రత కోసం రంగంలోకి దిగిన ఆపిల్
- వారానికి పది లక్షల ఫేస్ షీల్డ్స్ తయారీ
- ప్రస్తుతానికి అమెరికాలోనే వినియోగం
ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ సంస్థ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముఖాలకు రక్షణ కల్పించే కవచాలను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని భావిస్తోంది. ఈ ముఖ కవచాలు కరోనా చికిత్సలో పాలుపంచుకునే వైద్యసిబ్బందికి విశేషంగా ఉపకరిస్తాయని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ తెలిపారు.
ఈ ఫేస్ షీల్డ్స్ ను డిజైన్ చేసే క్రమంలో ఆపిల్ సంస్థ తన ప్రొడక్ట్ డిజైనర్లను, ఇంజినీరింగ్ ఉద్యోగులను, ప్యాకేజింగ్ సిబ్బందిని ఒక్కచోటికి చేర్చింది. 'ది క్యూపర్టినో' అనే కాలిఫోర్నియా సంస్థ ఈ ఫేస్ షీల్డ్స్ తయారుచేస్తోంది. వారానికి పది లక్షల కవచాలు తయారుచేయాలని నిర్ణయించారు. వీటిని ప్రస్తుతానికి అమెరికాలో వినియోగించనున్నారు. మున్ముందు ప్రపంచవ్యాప్తంగా అందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.