Sachin Tendulkar: కరోనాపై మనం చేసిన లాక్ డౌన్ యుద్ధ ఫలితం ఏప్రిల్ 14 తర్వాత కనిపిస్తుంది: సచిన్ టెండూల్కర్

Sachin attends video conference with PM Modi

  • క్రీడాప్రముఖులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్
  • పాల్గొన్న సచిన్ టెండూల్కర్
  • లాక్ డౌన్ తర్వాత కాలం ఎంతో కీలకమని ఉద్ఘాటన

కరోనా వైరస్ భూతంపై పోరులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని క్రీడా ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా పాల్గొన్నారు. కాన్ఫరెన్స్ అనంతరం సచిన్ స్పందిస్తూ, లాక్ డౌన్ తర్వాత కూడా ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, దేశం మొత్తం సమైక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారిపై చేసిన లాక్ డౌన్ యుద్ధం ఫలితం మార్చి 14 తర్వాత కనిపిస్తుందని పేర్కొన్నారు. క్రీడల్లో ఓ జట్టుగా ఎలా పోరాడతామో, కరోనాపైనా కలిసికట్టుగా పోరాడాలని సూచించారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత కాలం ఎంతో కీలకం అని సచిన్ అభిప్రాయపడ్డారు.

Sachin Tendulkar
Narendra Modi
Video Conference
Corona Virus
Lockdown
  • Loading...

More Telugu News