Earth: కరోనా ప్రభావం... భూమిపై బాగా తగ్గిన కంపన శబ్దాలు!

Earth is less noisy during corona lock dowm

  • లాక్ డౌన్ తో నిలిచిపోయిన వ్యవస్థలు
  • ఎక్కడా వినిపించని రణగొణ ధ్వనులు
  • ప్రపంచవ్యాప్తంగా శబ్దకాలుష్యం తగ్గుదల

కొన్నినెలల కిందటి వరకు ఉరుకులుపరుగులు పెట్టిన ప్రపంచం ఇప్పుడు కరోనా ప్రభావంతో బాగా నిదానించింది. వైద్యం, కరోనా నివారణ చర్యలు తప్ప మిగతావన్నీ మందగమనంలో సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ అయిన ఇలాంటి పరిస్థితుల్లో భూగర్భ శాస్త్రవేత్తలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నెలకిందట వరకు రణగొణ ధ్వనులతో ఉన్న ప్రపంచం ఇప్పుడు స్తబ్దుగా మారిపోయిందని, భూమి నుంచి వచ్చే సూక్ష్మ కంపన శబ్దాలు కూడా ఎన్నడూ లేనంతగా తగ్గాయని వివరించారు.

ప్రజా రవాణా వ్యవస్థలు నిలిచిపోవడం, వాహనాల జోరు తగ్గడం, ముఖ్యంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం వంటి అంశాలు ధ్వని తీవ్రత తగ్గేందుకు కారణాలయ్యాయని పరిశోధకులు తెలిపారు. భూమి నుంచి వచ్చే ధ్వనుల్లో 30 నుంచి 50 శాతం తగ్గుదల కనిపిస్తోందని బెల్జియంలోని రాయల్ అబ్జర్వేటరీకి చెందిన థామస్ లెకోక్ తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా నమోదైన శబ్దస్థాయితో పోల్చితే ప్రస్తుతం నమోదవుతున్న ధ్వని కంపనాల పౌనఃపున్యం చాలా తక్కువని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News