USA: భారతీయుల ముంగిట ప్రపంచ అతిపెద్ద లాటరీలు.. ఆన్ లైన్ లోనే కొనచ్చు!

Biggest Lotteries in the World welcomes Indians
  • గతంలో అమెరికా పవర్ బాల్ లాటరీ గెలిచిన భారతీయులు
  • అమెరికా వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడ్నించే లాటరీ కొనే చాన్స్
  • అవకాశం కల్పిస్తున్న ఆన్ లైన్ సంస్థలు
అమెరికాలో పవర్ బాల్ లాటరీ తగిలిందంటే ఎన్ని జన్మలెత్తినా తరగనంత నిధి సొంతం అవుతుంది. పవర్ బాల్ లాటరీ జాక్ పాట్ విజేతకు రూ.1370 కోట్ల  ప్రైజ్ మనీ ఇస్తారంటే అతిశయోక్తి కాదు. మెగా మిలియన్స్ లాటరీ కూడా ఇలాంటిదే. అంతకుముందున్న అన్ని లాటరీలనూ తోసిరాజంటూ 2016లో ముగ్గురు విజేతలకు సంయుక్తంగా పవర్ బాల్ లాటరీలో 1.6 బిలియన్ డాలర్ల జాక్ పాట్ మొత్తాన్ని చెల్లించి, రికార్డు సృష్టించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ లాటరీలు కొనుగోలు చేయాలంటే అమెరికాలోనే ఉండాల్సిన పనిలేదు. ప్రపంచంలో ఎక్కడైనా ఈ ప్రఖ్యాత లాటరీలో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. దీనికి చట్టబద్ధమైన అనుమతులు కూడా ఉన్నాయట.

ఇరాక్ లో నివసించే ఓ 37 ఏళ్ల వ్యక్తి కారులో వెళుతుండగా రూ.45 కోట్లు విలువ చేసే లాటరీ గెలుపొందావంటూ ఫోన్ వచ్చింది. మొదట్లో అది జోక్ అనుకున్న ఆ వ్యక్తి బ్యాంకుకు వెళ్లి తన టికెట్ చూపించిన తర్వాత అది నిజమేనని రూఢీ చేసుకున్నాడు.

భారతీయులు కూడా అమెరికా వెళ్లనవసరం లేకుండానే ఈ లాటరీ టికెట్లు కొనుగోలు చేయొచ్చు. కొన్ని ఆన్ లైన్ సంస్థలు ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. భారత్ లో ఎవరైనా సదరు సంస్థ వెబ్ సైట్ లో రిజిస్టర్ అయిన తర్వాత ఓ దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏ దేశంలో, ఏ లాటరీ టికెట్ కొనాలనుకుంటున్నారో ఆ వివరాలు దరఖాస్తులో పొందుపరిస్తే, ఆ సంస్థకు చెందిన ప్రతినిధి సదరు దేశంలో లాటరీ కొనుగోలు చేస్తాడు. తర్వాత కొన్ని లాంఛనాలు పూర్తి చేస్తే ఆ టికెట్ కు మీరే సొంతదారు అవుతారు.
USA
Lottery
India
Power Ball

More Telugu News